K Annamalai : తమిళనాడుకు రూ. 10,76,000 కోట్లు
కేంద్రం మంజూరు చేసిందన్న బీజేపీ చీఫ్
K Annamalai : తమిళనాడు సర్కార్ పై నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సీఎం ఎంకే స్టాలిన్ కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు. ఎన్ మన్ ఎన్ మక్కల్ పేరుతో ప్రజాయాత్ర చేపట్టారు కె. అన్నామలై(K Annamalai). మదురై తూర్పు, ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జనం హాజరయ్యారు. అన్నామలైకి బ్రహ్మరథం పట్టారు.
K Annamalai Comments
కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కింద తమిళనాడు రాష్ట్రానికి రూ. 10,76,000 కోట్లు అమలు చేసిందని చెప్పారు. ప్రధానమంత్రి హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద 15 లక్షల మంది లబ్ది పొందారని తెలిపారు. స్వచ్ఛ భారత్ పథకం కింద 57 లక్షల మందికి మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు కె. అన్నామలై.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు జీవిత బీమా పథకం , వైద్య బీమా పథకం, ఫసల్ బీమా యోజన, పెన్షన్ పథకం, సంపద పొదుపు పథకం, ఉపాధి కల్పన పథకం అమలు చేసినట్లు తెలిపారు. 2,02,000 కోట్ల రూపాయలతో రైతులు, మహిళలు, యువత, పారిశ్రామికవేత్తలు అన్ని వర్గాల వారు లబ్ది పొందారని పేర్కొన్నారు.
Also Read : PM Modi : రైల్వే స్టేషన్లలో అభివృద్ది పనులు