Ayutha Chandi Athirudram : 14 నుండి అయుత చండీ అతిరుద్రం

శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద

Ayutha Chandi Athirudram : శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ(SKJSN) ఆధ్వ‌ర్యంలో 80వ విశ్వ శాంతి మ‌హాయాగ మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నో యాగాలు నిర్వ‌హించిన ఘ‌న‌త శ్రీ స్వామి వారిది. లోక క‌ళ్యాణం కోసం , యావ‌త్ మాన‌వాళి ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కాంక్షిస్తూ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

Ayutha Chandi Athirudram Will Start

ఆగ‌స్టు 14 నుండి 27 వ‌ర‌కు స్వామి వారి దివ్య మంగ‌ళా శాస‌నాల‌తో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు . ఈ యాగాన్ని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల ప‌ట్ట‌ణంలోని స‌మీకృత బాయ్స్ హాస్ట‌ల్ పక్క‌న నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.

ప్ర‌తి రోజూ సామూహిక విశేష కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు గోపూజ‌, 7.30 గంట‌ల‌కు తుల‌సి పూజ‌, 9 గంట‌ల‌కు స‌హ‌స్ర లింగార్చ‌న‌, రుద్రాభిషేకం, 10 గంట‌ల‌కు కోటి కుంకుమార్చ‌న‌, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విష్ణు స‌హ‌స్ర నామం, ల‌లిత స‌హ‌స్ర నామం, సౌంద‌ర్య ల‌హ‌రి పారాయ‌ణం, 2 గంట‌ల‌కు హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం, భ‌జ‌న‌లు , రాత్రి 7 గంట‌ల‌కు రుద్ర‌క్ర‌మార్చ‌న‌, ల‌క్ష బిల్వార్చ‌న‌, 8.30 గంట‌ల‌కు తీర్థ ప్ర‌సాదం ఉంటుంది.

14న సోమ‌వారం(Monday) 10 గంట‌ల‌కు గ‌ణ‌ప‌తి పూజ‌, శుద్ది పుణ్య‌హ‌వాచ‌నం, పంచ‌గ‌వ్య ప్రాశ‌న‌, బుత్విక్ వ‌రుణ‌, గో స‌హిత యాగ‌శాల ప్ర‌వేశం, అఖండ జ్యోతి స్థాప‌న‌, యాగ‌శాల సంస్కార‌ములు, మాతృకాపూజ‌, వాస్తు హోమాలు, ప్ర‌ధాన మంట‌ప ఆరాధ‌న‌, ప్ర‌ధాన క‌ల‌శ స్థాప‌న , అగ్ని మ‌థ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ధ్వ‌జారోహ‌ణం, ప‌ర్య‌గ్నీక‌ర‌ణ నిర్వ‌హిస్తారు.

15న మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌హా గ‌ణ‌ప‌తి, ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి , చండీ హోమాలు, ఆది ల‌క్ష్మీ హోమం ఉంటుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు సామూహిక ల‌క్ష గ‌రికార్చ‌న ఉంటుంది.

16న బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌న్వంత‌రి, న‌క్ష‌త్ర, ధ‌న‌ల‌క్ష్మీ హోమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌న‌లక్ష్మీ పూజ‌లు చేప‌డ‌తారు.

17న గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ‌ల‌క్ష్మీ కుబేరం అష్ట‌ల‌క్ష్మీ ధాన్య ల‌క్ష్మీ హోమాలు, సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ ఉమామ‌హేశ్వ‌ర స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం జ‌రుగుతుంది.

18న శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు విశేష చండీ స‌హిత గ‌జ‌ల‌క్ష్మీ హోమాలు , సాయంత్రం 6 గంట‌ల‌కు సామూహిక విశేష ల‌క్ష్మీ కుంకుమార్చ‌న‌, ల‌క్ష గాజులార్చ‌న‌లు ఉంటాయి.

19న శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స‌హిత సుద‌ర్శ‌న‌, ల‌క్ష్మీనారాయ‌ణ న‌వ‌గ్ర‌హ‌, సంతాన ల‌క్ష్మీ హోమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంట‌ల‌కు వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం, లక్ష బిల్వార్చ‌న‌, రుద్రాక్ష మార్చ‌న ఉంటుంది.

20న ఆదివారం ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్య , స‌ర‌స్వ‌తి, ధైర్య‌లక్ష్మీ హోమాలు, విశేష సూర్య న‌మ‌స్కారాలు ఉంటాయి. సాయంత్రం 6 గంట‌ల‌కు స‌రస్వ‌తి పూజ‌లు, బాల పూజ‌లు నిర్వ‌హిస్తారు.

21న సోమ‌వారం(Monday) ఉద‌యం 7 గంట‌ల‌కు మృత్యుంజ‌య రుద్ర హోమాలు, విజ‌య ల‌క్ష్మీ హోమం ఉంటుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు ద‌శ స‌హ‌స్ర విశేష అభిషేకాలు ఉంటాయి.

22న మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు వివాహం కాని ఆడ‌, మ‌గ‌వారికి హోమాలు జ‌రుగుతాయి. సాయంత్రం 6 గంట‌ల‌కు ఆంజ‌నేయ స్వామి వారికి ల‌క్ష త‌మ‌ల‌పాకుల అర్చ‌న చేప‌డ‌తారు.

23న బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ర్వ సూక్త‌, సుబ్ర‌హ్మ‌ణ్య స‌మేత సంతాన వేణుగోపాల హోమాలు, సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ ల‌క్ష్మీ నృసింహ క‌ళ్యాణ మహోత్స‌వం ఉంటుంది.

24న గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ మేధా ద‌క్షిణ మూర్తి, రామ గాయ‌త్రి స‌హిత చండీ హోమాలు , సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ సీతారామ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం చేప‌డతారు.

25న శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు చండీ స‌హిత న‌వ దుర్గ హోమాలు , సామూహిక లక్ష్మీ వ్ర‌తం ఉంటుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌ర‌ల‌క్ష్మి అమ్మ వారికి విశేష చ‌క్ర అర్చ‌న‌, పంచామృత అభిషేకం , ల‌క్ష గాజుల అర్చ‌న‌, లక్ష కుంకుమ అర్చ‌న ఉంటుంది.

26న శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ సుద‌ర్శ‌న పూర్వ‌క మ‌హా మృత్యుంజ‌య‌, వ‌ర‌ల‌క్ష్మీ స‌మేత మ‌హా నారాయ‌ణ హోమాలు, సీతారాముల‌కు విశేష అభిషేకాలు ఉంటాయి.

27న ఆదివారం 11.48 నిమిషాల‌కు మ‌హా పూర్ణాహుతి, గురు పూజ‌, శ్రీ‌కృష్ణ ఉట్టి కొట్ట‌డం జ‌రుగుతుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ‌రాధా కృష్ణ శాంతి క‌ళ్యాణ మ‌హోత్స‌వంతో పూర్త‌వుతుంది. భ‌క్తులు విశేషంగా పాల్గొని త‌ర‌లించాల‌ని స్వామి వారు కోరారు.

Also Read : K Annamalai : త‌మిళ‌నాడుకు రూ. 10,76,000 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!