Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మన్ గా భూమన
రెండోసారి నియమించిన జగన్
Bhumana Karunakar Reddy : అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియతులయ్యారు. ఈ మేరకు శనివారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Bhumana Karunakar Reddy Appointed
భూమన కరుణాకర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్ గా పని చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఆగస్టు 8వ తేదీతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠకు తెర దించారు జగన్ మోహన్ రెడ్డి.
వివాద రహితుడిగా, సీఎంకు కావాల్సిన వ్యక్తిగా గుర్తింపు పొందారు భూమన కరుణాకర్ రెడ్డి. రెండో సారి ఆయనకు ఛాన్స్ దక్కడంతో భూమన కుటుంబంలో, అనుచరుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మరో వైపు ప్రస్తుతం ఉన్న టీటీడీ చైర్మన్ ను రెండోసారి పొడిగించారు జగన్ రెడ్డి. ఆయన హయాంలో టీటీడీలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా భూమనకు టీటీడీ కీలక పదవి దక్కడం విశేషం.
Also Read : Imran khan Arrest Comment : బోనులో చిక్కిన ‘సింహం’