Revanth VS Uttam : గాంధీ భవన్ లో రేవంత్ వర్సెస్ ఉత్తమ్
అసత్య ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపణ
Revanth VS Uttam : గాంధీ భవన్ సాక్షిగా నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగింది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఇదే సమయంలో ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని హైకమాండ్ ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు కీలక మార్పులు చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను కూడా మార్చేసింది.
Revanth VS Uttam Argument
ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేను నియమించింది. పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అసంతృప్తి లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది.
వ్యక్తిగతంగా తనకు డ్యామేజ్ కలిగేలా రేవంత్ రెడ్డి వర్గం ప్రయ్నతం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్ సమక్షంలోనే ఒకరిపై మరొకరు తిట్టుకున్నారు. దీంతో పార్టీ నేతలు, శ్రేణులు విస్తు పోయారు. తనపై కావాలని రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సైతం ఊరుకోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై భగ్గుమన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది.
Also Read : Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మన్ గా భూమన