KTR Tribute : జయశంకర్ సారు జీవితం ఆదర్శప్రాయం
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి
KTR Tribute : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయమని కొనియాడారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఆగస్టు 6న జయశంకర్ జయంతి. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో జయ శంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ధీరోదాత్తుడు. ఆయన చలవ వల్లనే ఇవాళ రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు కేటీఆర్.
KTR Tribute To Jayashankar
ఆచార్య జయశంకర్ ఓరుగల్లులో 6 ఆగస్టు 1934లో పుట్టారు. 21 జూన్ 2011లో కాలం చేశారు. ఎన్నో పదవులు నిర్వహించారు. భారత దేశంలో గర్వించ దగిన మేధావులలో ఒకడిగా గుర్తింపు పొందారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఉద్యమ సిద్దాంతకర్త. 1952 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు కేటీఆర్(KTR). కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ గా పని చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు.
కాలికి బలపం పట్టుకుని తిరిగారు. ఆయన తిరగని పల్లె లేదు. ప్రత్యేకంగా తెలంగాణ భాష, సంస్కృతి, నాగరికత గురించి, చరిత్రను వక్రీకరించాడన్ని వ్యతిరేకించారని కొనియాడారు కేటీఆర్. కొత్తపల్లి జయశంకర్ సారు జీవితం ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సారు గౌరవార్థం , జ్ఞాపకార్థం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయానికి పేరు పెట్టారు. రాష్ట్రంలో ఉన్నది ఏకైక యూనివర్శిటీ.
Also Read : KTR Revanth Reddy : రేవంత్ రెడ్డికి ఏదో రోగం ఉంది – కేటీఆర్