Eatala Rajender : రైతు కూలీలకు బీమా అమలు చేయాలి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Eatala Rajender : రైతు బంధు, రైతు బీమా వల్ల రైతులకు కొంత మేరకు మేలు జరుగుతోందని, ఇదే సమయంలో ఆరుగాలం పొలాలు, ఇతర రంగాలలో పని చేస్తున్న కూలీలకు కూడా రైతు బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్(Eatala Rajender) . ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో ఈటల మాట్లాడారు. రాను రాను వ్యవసాయం భారంగా మారిందన్నారు. ఇదే సమయంలో పెట్టుబడి సాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఈటల రాజేందర్.
Eatala Rajender Asking
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు కల్పిస్తే వారికి రక్షణగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఇదే సమయంలో రైతు కూలీలు లేకుండా సాగు చేసే పరిస్థితి లేదన్నారు. అందు వల్ల రైతు బంధు, రైతు బీమా రైతులకు ఎలా సౌకర్యంగా, ఆసరాగా ఉందో ఇదే రీతిన రైతు కూలీలకు కూడా భరోసా ఇస్తే బాగుంటుందన్నారు ఈటల రాజేందర్.
మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేయాలని కోరారు. దీని విషయంలో అవసరమైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న వేలాది మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
Also Read : MLA Seethakka : అసెంబ్లీ నుంచి సీతక్క వాకౌట్