CM KCR Tribute : తెలంగాణ గాంధీకి కేసీఆర్ దండం
నివాళులు అర్పించిన సీఎం
CM KCR Tribute : తెలంగాణ సిద్దాంత కర్త దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆచారి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మార్గదర్శకత్వం చేసిన గొప్ప యోధుడు అని కొనియాడారు. జయశంకర్ సారు జీవితం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు కేసీఆర్(KCR). అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభం కంటే ముందు సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
CM KCR Tribute to Jaishankar
తనకు కొన్నేళ్లుగా దిశా నిర్దేశం చేస్తూ వచ్చారని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి పూస గుచ్చినట్లు వివరించిన ఘనత జయశంకర్ సారుకే చెల్లుతుందన్నారు. ఇదిలా ఉండగా ఆచార్య జయశంకర్ ఆచారి ఆచార్య జయశంకర్ ఓరుగల్లులో 6 ఆగస్టు 1934లో పుట్టారు.
21 జూన్ 2011లో కాలం చేశారు. ఎన్నో పదవులు నిర్వహించారు. భారత దేశంలో గర్వించ దగిన మేధావులలో ఒకడిగా గుర్తింపు పొందారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనమైన చరిత్ర ఆయనదని పేర్కొన్నారు.తాను గౌరవించే వ్యక్తులలో కొత్తపల్లి జయశంకర్ అని ప్రశంసించారు సీఎం కేసీఆర్.
Also Read : Minister KTR : సంస్కార హీనుడు రేవంత్ రెడ్డి