Vanama Venkateswara Rao : కొత్తగూడెం ఎమ్మెల్యేకు ఊరట
తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే
Vanama Venkateswara Rao : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కు భారీ ఊరట లభించింది. వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వనమా వేంకటేశ్వర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు ప్రకటించింది.
Vanama Venkateswara Rao Issue
ఈ మేరకు వనమా వెంకటేశ్వర్ రావు(Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తున్నట్లు వెల్లడించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 1989 నుంచి 1994 వరకు , 1999 నుండి 2008 వరకు , 2018 నుంచి 2023 జూలై 25 వరకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నవంబర్ 1, 1944లో పాల్వంచలో పుట్టారు. ప్రస్తుతం అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి తరపున ఉన్నారు.
పాల్వంచ వార్డు సభ్యునిగా తన పొలిటికల్ కెరీర్ గా ప్రారంభించాడు. 16 ఏళ్ల పాటు సర్పంచ్ గా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబెనట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వనమా వేంకటేశ్వర్ రావు. జలగం వెంకటరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. డీసీసీ చీఫ్ గా కూడా పని చేశాడు. వనమా ఎన్నిక చెల్లదంటూ జూలై 25న తీర్పు వెలువరించింది.
Also Read : Daniel Vettori : సన్ రైజర్స్ హైద్రాబాద్ కోచ్ గా వెట్టోరీ