Gaddar Final Rites : చివరి చూపు కోసం జన సందోహం
ప్రజా యుద్ద నౌక అంతిమ యాత్ర
Gaddar Final Rites : ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మధ్యాహ్నం లాల్ బహదూర్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ యాత్ర వెంట జనం బారులు తీరారు. ఆల్వాల్ వరకు తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు పోలీసులు. భాగ్యనగరం మొత్తం విషాదానికి లోనైంది. తెలంగాణ వ్యాప్తంగా కన్నీటి పర్యంతమైంది.
Gaddar Final Rites Huge Cloud
కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు, సినీ, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వేలాది మంది గద్దర్ అంతిమ యాత్ర వెంట నడిచారు. దేశం నలుమూలల నుంచి , ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజా యుద్ద నౌక చివరి చూపు చూసేందుకు వచ్చారు.
1991లో గద్దర్ ఏర్పాటు చేసిన మహా బోధి పాఠశాల ఆవరణలో తన అంత్య క్రియలు జరిపించాలని తన అంతిమ కోరిక అని చెప్పడంతో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు గద్దర్(Gaddar Final Rites) ను స్మరించుకున్నారు. ఇలాంటి కళాకారుడు ఈ దేశంలో పుట్టడన్నారు. తెలంగాణ చేసుకున్న పుణ్యమని పేర్కొన్నారు. ఆయనతో పాడించడమే కాదు నటింప చేసినందుకు ఆనందంగా ఉందన్నారు .
Also Read : Akbaruddin Owaisi : తెలంగాణను చూసి నేర్చుకోవాలి