G Kishan Reddy : పాట‌ల యోధుడు గ‌ద్ద‌ర్ – కిష‌న్ రెడ్డి

ప్ర‌జా యుద్ద నౌక‌కు నివాళి

G Kishan Reddy : తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసిన అరుదైన గాయ‌కుడు గ‌ద్ద‌ర్. ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల‌కు చెందిన వారున్నారు. ఇవాళ ఆయ‌న లేర‌న్న వాస్త‌వాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. త‌న ఆట‌తో, త‌న పాట‌తో , త‌న మాట‌ల‌తో ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌ను నిన్న‌టి వ‌ర‌కు ఉర్రూత‌లూగించే ప్ర‌య‌త్నం చేశాడు. నిత్యం చైత‌న్య‌వంత‌మైన ఈ గాయ‌కుడు ఇలా నేస్త‌జంగా ప‌డుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ట్టుకోలేక పోతున్నారు.

G Kishan Reddy Emotional Words

పాటంటే చైత‌న్యం అని , అది ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆచ‌ర‌ణ‌లో చూపించిన ఏకైక గాయ‌కుడు ..ఒకే ఒక్క‌డు గ‌ద్ద‌ర్. ప్ర‌పంచంలో ఎంద‌రో జ‌నం కోసం గానం చేశారు. కానీ శ‌రీరంలో తూటాను పెట్టుకుని పాడిన పాట‌గాళ్లు లేరు. ఒక్క గ‌ద్ద‌ర్ మాత్ర‌మే అసాధార‌ణ‌మైన రీతిలో చివ‌రి శ్వాస వ‌ర‌కు పాడాడు..ఆడాడు..ఇంకా కొద్ది సేప‌ట్లో త‌న ప్రాణం పోతుంద‌ని తెలిసినా పాట‌ను పాడ‌కుండా ఉండలేదు.

ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ జి. కిష‌న్ రెడ్డి(G Kishan Reddy) గ‌ద్ద‌ర‌న్న‌కు నివాళులు అర్పించారు. ఆయ‌న పాట‌ల యోధుడ‌ని కొనియాడారు. ఆయ‌న‌తో త‌న‌కు ద‌గ్గ‌రి స‌న్నిహితం ఉంద‌ని గుర్తు చేసుకున్నారు. పాట ఉన్నంత వ‌ర‌కు గ‌ద్ద‌ర్ బ‌తికే ఉంటాడ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : VC Sajjanar : గ‌ద్ద‌ర్ పేరు కాదు ఒక బ్రాండ్ – స‌జ్జ‌నార్

Leave A Reply

Your Email Id will not be published!