Manmohan Singh : మన్మోహన్ సింగ్ నిబద్దతకు సెల్యూట్
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు
Manmohan Singh : డాక్టర్ మన్మోహన్ సింగ్ తన నిబద్దతను చాటుకున్నారు. పార్లమెంట్ పట్ల తనకు ఉన్న గౌరవాన్ని మరోసారి ప్రదర్శించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ కు వ్యతిరేకంగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు తీసుకు వచ్చింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ప్రవేశ పెట్టింది.
Manmohan Singh Showed commitment
దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఇప్పటికే కేంద్రానికి ఒక్క లా అండ్ ఆర్డర్ తప్ప ఎలాంటి హక్కులు ఢిల్లీ ప్రభుత్వంపై ఉండవని స్పష్టం చేసింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. అంతే కాకుండా కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కు సంతకం చేయడం తప్ప ఎలాంటి పవర్స్ ఉండవని పేర్కొంది.
ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయినా కేంద్రం ఒప్పుకోకుండా ఉన్నతాధికారులపై తమ పెత్తనం కొనసాగించేలా బిల్లును తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి లోక్ సభలో బిల్లు పాస్ అయినా రాజ్యసభలో ఆశించిన మెజారిటీ లేదు. దీంతో డిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సంబంధించి ఓటు వేసేందుకు మన్మోహన్ సింగ్(Manmohan Singh) ఆరోగ్యం బాగా లేక పోయినా వచ్చారు. ప్రస్తుతం మాజీ పీఎం నిబద్దతకు ఎంపీలు సలాం చేస్తున్నారు.
Also Read : Gaddar Poem : గద్దర్ కవిత సంచలనం