Gaurav Gogoi : మోదీ మౌనం దేశానికి ప్ర‌మాదం

గౌర‌వ్ గొగోయ్ షాకింగ్ కామెంట్స్

Gaurav Gogoi : మ‌ణిపూర్ పై లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింద‌నే దానిపై సంచ‌ల‌న ప్ర‌సంగం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గౌర‌వ్ గొగోయ. అవిశ్వాస తీర్మానం అంటే అంకెలు లేదా సంఖ్య‌లు కాద‌న్నారు. ఇది దేశానికి సంబంధించిన ప్ర‌ధానమైన స‌మ‌స్య‌పై చ‌ర్చ‌కు తీసుకు రావ‌డం అన్న‌ది గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు. అధికారంలో ఉన్న వారికి ప్ర‌తిప‌క్షాలను గౌర‌వించ‌డం తెలియ‌ద‌ని అనుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

Gaurav Gogoi Explanation

మ‌ణిపూర్ కాలి పోతోందంటే అర్థం పూర్తిగా దేశం కూడా కాలి పోతుంద‌ని ఆ మాత్రం మ‌ణిపూర్ ప‌ట్ల ప్రేమాభిమానం లేని వాళ్లు లేనిపోని నింద‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి మౌనాన్ని ఆశ్ర‌యించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

న్యాయం కోసం మ‌హిళా రెజ్ల‌ర్లు వీధుల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో, రైతులు సాగు చ‌ట్టాల కోసం ఉద్య‌మించిన స‌మ‌యంలో చ‌ని పోయిన‌ప్పుడు ప్ర‌ధాని నోరు విప్ప‌లేదద‌ని గుర్తు చేశారు గొగోయ్(Gaurav Gogoi). 2020లో ఢిల్లీలో అల్ల‌ర్లు చోటు చేసుకున్న‌ప్పుడు, రాహుల్ గాంధీ స‌భ‌లో అదానీని, చైనా గురించి నిల‌దీసిన స‌మ‌యంలో మాట్లాడ లేద‌న్నారు. అంతే కాదు పుల్వామాలో జ‌వాన్ల‌కు భద్ర‌త క‌ల్పించాల‌ని కోరినా ప‌ట్టించు కోలేద‌న్నారు. క‌రోనా స‌మ‌యంలో వ్యాక్సిన్లు కావాల‌న్నా స్పందించ లేద‌న్నారు గౌర‌వ్ గొగోయ్.

Also Read : INDIA Walk Out : రాజ్య‌స‌భ నుండి విప‌క్షాలు వాకౌట్

Leave A Reply

Your Email Id will not be published!