Revanth Reddy KCR : కేసీఆర్ పై రేవంత్ గుస్సా
టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Revanth Reddy KCR : ఎన్నికల వేల మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఆరోపణల పర్వం మొదలైంది. తనకు పిండం పెడతానని చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఏకి పారేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Revanth Reddy KCR Discussion
ఆయన మీడియాతో మాట్లాడారు. సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జెండా మోసేందుకు ఎవరూ రాలేదని కానీ తాను ముందుకు వచ్చానని చెప్పారు. నేను కేసీఆర్ ను భుజాల మీద మోసిన సంగతి మరిచి పోతే ఎలా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు , చెవాకులు పేలుతున్న కేసీఆర్ కు సోయి లేదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వక పోతే ఈనాడు కేసీఆర్ ఏడుండే వాడో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. 2004లో కాంగ్రెస్ భిక్షం పెట్టకుంటే కేసీఆర్ , కేటీఆర్ నాంపల్లి దర్గా దగ్గర, బిర్లా టెంపుల్ మెట్ల మీద , మెదక్ చర్చి దగ్గర అడుక్కు తినే వాళ్లంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Also Read : Siddique Ismail : సిద్దిక్ మరణం తీరని దుఖఃం