Gruha Lakshmi Scheme : గృహలక్ష్మికి డెడ్ లైన్ లేదు
స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్
Gruha Lakshmi Scheme : గృహ లక్ష్మి పథకానికి సంబంధించి ఎలాంటి తుది గడువు అన్నది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులు చేసుకునేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. గృహ లక్ష్మి పథకం ఒక్క రోజుతోనే లేదా మూడు రోజుల తోనే అయిపోయే పథకం కాదని స్పష్టం చేసింది. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొంది.
Gruha Lakshmi Scheme No End
ఇండ్లు లేని నిరుపేదలకు సంబంధించి ఖాళీ స్థలం ఉంటే సొంత ఇల్లు కట్టు కునేందుకు రూ. 3 లక్షలు సర్కార్ పరంగా సాయం చేస్తామని తెలిపింది. గృహ లక్ష్మి(Gruha Lakshmi Scheme) కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం.
గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కానీ లేదా స్థలాలకు కానీ దస్తావేజు పత్రాలు ఉండవని , ఇంటి నెంబర్ అయినా సరే లేకుండా ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. గడువు అయి పోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. దరఖాస్తుదారులు తమ ప్రజా ప్రతినిధుల ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా దరఖాస్తులు అందజేయాలని సూచించింది.
Also Read : Pawan Kalyan : అడవి బిడ్డలకు విద్య, వైద్యం ఉండాలి