Dasoju Sravan : సీఎం ఆశీస్సులతోనే ఎమ్మెల్సీ
బీఆర్ఎస్ అగ్ర నేత దాసోజు శ్రవణ్
Dasoju Sravan : బీఆర్ఎస్ అగ్ర నేత దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణం ఏమీ లేదని కేవలం సీఎం కేసీఆర్ చలవ వల్లనే వచ్చిందన్నారు. తనకు ఎలా వచ్చిందనే విషయంపై ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
Dasoju Sravan Explains
కేసీఆర్ భోజనం చేస్తుండగా వెళ్లాను. తిన్నవా అని అడిగుండు సార్. తినే వచ్చానని చెప్పాను. నీ దగ్గర ఇప్పుడు రెజ్యూమ్ రెడీగా ఉందా అన్నారు. లేదు సార్, తీసుకు రాలేదన్నా. భోజనం అయి పోయింది. సీఎం సార్ కేబినెట్ మీటింగ్ వుందంటూ వెళ్లి పోయారు. లోపట ఏం మాట్లాడుకున్నారో తెలియదు.
మంత్రి కేటీఆర్ పబ్లిక్ గానే అనౌన్స్ చేసిండి. గవర్నర్ కోటా కింద సత్యనారాయణకు, నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా కేసీఆర్ ప్రతిపాదించారని, దీనికి మంత్రివర్గం ఎలాంటి అభ్యంతరం తెలియ చేయకుండానే ఓకే చెప్పిందన్నారు.
దాసోజు శ్రవణ్(Dasoju Sravan) విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా. ఉన్నత చదువులు చదివారు. ఎన్నో కంపెనీలకు కన్సల్టెంట్ గా పని చేశారు. ప్రజా రాజ్యం, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లో ఉన్నారు. కీలక పాత్ర పోషించారు. చివరకు స్వంత గూటికి చేరారు . ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కడం విశేషం.
Also Read : CM KCR Tribals Day : ఆదీవాసీలకు బీఆర్ఎస్ సర్కార్ భరోసా