Pawan Kalyan : ఏపీలో అర్చకుడిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ(Janasena Party) చీఫ్ పవన్ కళ్యాణ్. పవిత్రమైన యజ్ఞోప వీతాన్ని తెంచి వేయడం పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు. భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం అర్చకుడు నాగేంద్ర పవన్ పై వైసీపీ నాయకుడు, ఆలయ బోర్డు చైర్మన్ భర్త యుగదంధర్ దాడికి పాల్పడడాన్ని మండిపడ్డారు. వైదిక ఆచారాల్లో యజ్క్షోప వీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారని పేర్కొన్నారు.
Pawan Kalyan Comments
వేదాలు అధ్యయనం చేసి, నిత్యం నిష్టతో ఉంటూ దేవుడికి సేవలు చేసే అర్చకుడిపై దాడికి పాల్పడడం ఎంత వరకు సబబు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక హిందువులపై, అర్చకులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు .
అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని పిచ్చి పట్టి నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. తాము తీవ్రంగా వ్యతిరేకించడం తో దానిని వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఈశ్వరుడి సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతే కాకుండా ఈ ఘటనతో పాటు రాష్ట్రంలోని హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి, దాడులపై కేంద్రంలోని మోదీ సర్కార్ కు ఓ నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : Dasoju Sravan : సీఎం ఆశీస్సులతోనే ఎమ్మెల్సీ