Minister KTR : రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన వ్యాధి
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) . బుధవారం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు నయం కాని వ్యాధి అంటూ పేర్కొన్నారు.
Minister KTR Comments
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నాడని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల ఎలాంటి ప్రేమ, గౌరవం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు కేటీఆర్.
పొద్దస్తమానం తనను, తన తండ్రిని తిట్టడం తప్ప మరే పనీ లేదని అన్నారు. ఇదేనా రాజకీయం అని నిలదీశారు. ఎంత సేపు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడం తప్ప మరోటి చేత కాదన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో పుట్టగతులు లేకుండా ప్రజలు చేస్తారని జోష్యం చెప్పారు. పదవి ఉంది కదా అని విర్రవీగితే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.
ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తికి టీపీసీసీ చీఫ్ పదవి ఎందుకు ఇచ్చారో ఆ పార్టీ ఆలోచించాలని అన్నారు. ఇక నుంచి నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు కేటీఆర్.
Also Read : Kerala Name Change : ఇకపై కేరళ పేరు ‘కేరళం’