Mahua Moitra : ప్రతిపక్షాలు మాట్లాడితే పట్టించుకోరా
టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా
Mahua Moitra : కేంద్ర సర్కార్ పై , ప్రత్యేకించి స్పీకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా(Mahua Moitra). పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్యసభలలో కేవలం బీజేపీ ఎంపీలకే ప్రయారిటీ ఇవ్వడం దారుణమన్నారు. మరో వైపు దేశానికి సంబంధించి ప్రధాన సమస్యలపై , అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో మీడియా కూడా అధికార పార్టీ, వారికి మద్దతు ఇస్తున్న మంత్రులు, ఎంపీలపైనే ఫోకస్ పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహూవా మొయిత్రా.
Mahua Moitra Comments
ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు మాట్లాడిన సమయంలో పట్టించు కోక పోవడం దారుణమన్నారు ఎంపీ. ఇక ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంసద్ టీవీ పూర్తిగా మోదీ, అమిత్ షా, ఇతర మంత్రులు, స్పీకర్ పైనే ఫోకస్ పెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఓ వైపు మణి పూర్ కాలిపోతుంటే కేంద్రం మాత్రం కిమ్మనడం లేదన్నారు . అసలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఉన్నారా లేరా అన్న అనుమానం కలుగుతోందంటూ ఎద్దేవా చేశారు మహూవా మొయిత్రా. పార్లమెంట్ సాక్షిగా ఇంతటి వివక్ష ఉంటే ఇక ప్రజలను ఎలా మీరు ప్రేమిస్తారంటూ ప్రశ్నించారు.
Also Read : Telangana Govt Denied : స్వంత నిధులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు