Justice S Muralidhar : జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్ వెరీ స్పెష‌ల్

సంచ‌ల‌న తీర్పుల‌కు పెట్టింది పేరు

Justice S Muralidhar : ఒరిస్సా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్. సంచ‌ల‌న తీర్పుల‌కు పెట్టింది పేరు. ఆయ‌నకు వంద‌లాది మంది వీడ్కోలు ప‌లికారు విన‌మ్రంగా. స‌ర్కార్ కు సాగిల‌ప‌డితే ఇలాంటి స్వాగ‌తాలు ఉండ‌వు. ఇదే విష‌యాన్ని ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి అరుంధ‌తి రాయ్ ప్ర‌స్తావించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న 17 ఏళ్ల కెరీర్ ముగిసింది. కానీ ఎన్నో తీర్పులు గుర్తుంచుకునేలా ఇచ్చారు. ఇదీ జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్ ప్ర‌త్యేక‌త‌.

Justice S Muralidhar Journey

రాజ‌స్థాన్ హైకోర్టు సీజే అకిల్ కురేషి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు త‌న ప్ర‌సంగంలో. స్పూర్తి దాయ‌కంగా నిలిచిన వారిలో ఆయ‌న కూడా ఒక‌రని కితాబు ఇచ్చారు జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్(Justice Muralidhar). ఆయ‌న స్థానంలో జ‌స్టిస్ సుభాసిస్ త‌ల‌పాత్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

నా సుదీర్ఘ కెరీర్ లో ఒరిస్సాలో ప‌ని చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నారు జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్. జ‌న‌వ‌రి 4, 2021 నుండి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న స‌మ‌యంలో పేప‌ర్ లెస్ కోర్టుల‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇ ఫైలింగ్ వెబ్ పోర్ట‌ల్ ఏర్పాటు చేశారు. అంతే కాదు రాష్ట్రంలోని వివిధ ప్ర‌దేశాల‌లో 20 వ‌ర్చువ‌ల్ కోర్టులు, హైకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ప్రోసీడింగ్స్ ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేలా చేశారు.

1984లో చెన్నైలో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1987లో ఢిల్లీకి మారారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్నారు. ఫిబ్ర‌వ‌రి 27, 2020 దాకా ప‌ని చేశారు. పంజాబ్, హ‌ర్యానా హైకోర్టుకు బ‌దిలీ చేసింది కేంద్రం. ఢిల్లీలోని ఆస్ప‌త్రిలో చిక్కుకున్న 22 మందిని ర‌క్షించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ద్వేష పూరిత ప్ర‌సంగాల‌పై కీల‌క తీర్పు వెలువ‌రించారు. స్వ‌లింగ సంప‌ర్కాన్ని నేరంగా ప‌రిగ‌ణించ‌ని బెంచ్ లో స‌భ్యుడిగా ఉన్నారు జ‌స్టిస్ ముర‌ళీధ‌ర్.

Also Read : Rahul Gandhi : ప్ర‌జా సంక్షేమం కాంగ్రెస్ ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!