Dasoju Sravan : భారత రాష్ట్ర సమితి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుతత్వాన్ని ఏకి పారేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 86,000 వేల కోట్లు ఇచ్చిందంటూ జార్ఖండ్ ఎంపీ లోక్ సభ సాక్షిగా చెప్పడాన్ని తప్పు పట్టారు. ఇది పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా సభలో మాట్లాడతారంటూ ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.
Dasoju Sravan Serious Comments
అబద్దాలతో, అసత్యాలతో ఇలా ఎంత కాలం దేశాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారంటూ నిలదీశారు బీఆర్ఎస్ అగ్ర నేత. తెలంగాణ అపర భగీరథుడిగా పేరు పొందిన సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పెద్ద జలాశయం ఇది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు కేంద్రం.
ఎలాంటి నిధులు ఇవ్వకుండానే ఇచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). తెలంగాణ ప్రభుత్వం స్వంతంగా వనరులను , బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల ద్వారానే ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇక నుంచైనా అబద్దాలు చెప్పే ముందు ఆలోచించు కోవాలని కేంద్రానికి హితవు పలికారు దాసోజు శ్రవణ్.
Also Read : Justice S Muralidhar : జస్టిస్ మురళీధర్ వెరీ స్పెషల్