RS Praveen Kumar : కాజేశారు కోట్లు కొట్టేశారు – ఆర్ఎస్పీ
దళితుల భూములకు ఎసరు పెట్టారు
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విలువైన భూములను అమ్మకానికి పెట్టాడని, చివరకు దళితులకు సంబంధించిన స్థలాలను అక్రమంగా కాజేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వాళ్లపై దాడులకు తెగబడడం, కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేసి బెదిరింపులకు దిగడం పరిపాటిగా రాష్ట్రంలో మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveen Kumar Serious Comments
ప్రధానంగా విలువైన , కోట్లాది రూపాయల భూములను కోల్పోయింది ఎస్సీ మాల, మాదిగ బిడ్డలేనని పేర్కొన్నారు. వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారని వాపోయారు. 40 ఎకరాల హక్కు దారుల నుండి ఇవాళ 60 గజాల ఇంటి జాగా కోసం గోడ మీద కూర్చొని బిచ్చం ఎత్తుకునే స్థాయికి సీఎం కేసీఆర్ , కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ దోపిడీ దొంగల ఫోటోలను ఇళ్ల నుండి, గల్లీల నుండి తీసేసి ఒక ఉద్యమ స్పూర్తితో కుండీల్లో అర్జెంటుగా పడేయాలని పిలుపునిచ్చారు బీఎస్పీ చీఫ్. ఇక బుద్వేల్ లో 266 ఎకరాల దళితుల భూమిని ఆక్రమించుకుని వేలం పాట వేశారంటూ ఫైర్ అయ్యారు. ఎకరాకు రూ. 46 కోట్లకు పైగా అమ్ముకున్నారని ఆరోపించారు.
Also Read : Gaurav Gogoi : మణిపూర్ పై పెదవి విప్పని మోదీ