Bandi Sanjay : బీజేపీ ఎంపీ బండి సంజయ్ లోక్ సభ సాక్షిగా నిప్పులు చెరిగారు. ఆవేశంతో రెచ్చి పోయారు. ఈ దేశం గురించి గొప్పగా చెప్పారు. కొన్ని దుష్ట శక్తులు దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నందుకు గర్వ పడుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా నమస్తే సదా వత్సలే మాతృ భూమే , త్వయా హిందూ భూమే సుఖం వర్దితోహమ్ , మహా మంగళే పుణ్య భూమే త్వదర్థే , పతత్వేష కాయో నమస్తే నమస్తే అంటూ శ్లోకం చదివారు.
Bandi Sanjay Speech in Lok Sabha
నన్ను ఎంతో వాత్సత్య పూరితంగా చూసే నా మాతృ భూమికి నేను ఎల్లప్పుడూ అత్యంత భక్తి భావంతో నమస్కరిస్తూనే ఉంటాను. నాకు ఇంతటి సుఖాన్ని ఇచ్చిన ఈ హిందూ భూమి కోసం నా శరీరం పతనం అయ్యేంత వరకు నేను సేవ చేస్తూనే ఉంటానని అన్నారు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ పటేల్.
పదే పదే నిక్కర్ వాళ్లు అంటూ హేలన చేసే లిక్కర్ గ్యాంగులకు ఏం తెలుసు అని నిలదీశారు. నిత్యం విదేశీయులను, విదేశాలను కీర్తించి , ప్రేమించే వాళ్లకు ఈ దేశం గురించి ఎలా ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు ఎంపీ. గుండెల నిండా ప్రేమను, దేశ భక్తిని నింపుకున్న ఈ నిక్కర్ వాళ్లే ఈ సమాజానికి త్యాగాన్ని, సమర్పణ భావాన్ని నేర్పించ గలరని గుర్తించాలని అన్నారు. బండి సంజయ్ స్పీచ్ కు ఎంపీలు అభినందించారు.
Also Read : Renu Desai : ప్లీజ్ మమ్మల్ని లాగకండి – రేణు దేశాయ్