CM KCR : సారూ దండం ఎట్టకేలకు మోక్షం
పాలమూరు ఎత్తిపోతలకు ఓకే
CM KCR : పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు అనుమతి లభించింది. కొంత కాలంగా కేసులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు పర్యావరణ అనుమతి కూడా దక్కింది. దీంతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. జిల్లా ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
CM KCR Appreciations From Minister Srinivas Goud
కేసీఆర్ ను పాలమూరు జిల్లా అక్కున చేర్చుకుంది. ఎంపీగా గెలిపించింది. ఉద్యమానికి ఊపిరి పోసింది. మలి దశ ఉద్యమానికి ముందుండి నడించింది ఈ జిల్లా ప్రజలే. అందుకే ఈ జిల్లా అంటే సీఎంకు ఎంతో ప్రేమ ఉందన్నారు శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud). పర్యావరణ అనుమతి పేరుతో కేంద్రం కొర్రీలు పెడుతూ వచ్చింది.
సుదీర్ఘ కాలం పాటు కోర్టులో పోరాడింది తెలంగాణ ప్రభుత్వం. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని తెలిపారు మంత్రి . పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలుకు సంబంధించి అనుమతి రాకుండా కుట్ర పన్నారని, కోర్టుకు ఎక్కారని చివరకు తామే గెలిచామని పేర్కొన్నారు.
Also Read : Puvvada Ajay Kumar : ఆర్టీసీకి ఢోకా లేదు – పువ్వాడ