Riyaz : రియాజ్ అరెస్ట్ రేవంత్ సీరియస్
తక్షణమే వదిలి పెట్టాలని డిమాండ్
Riyaz : టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). వెంటనే విడుదల చేయాలని కోరారు. అరెస్ట్ నెపంతో బీఆర్ఎస్ పార్టీ కిడ్నాప్ డ్రామా ఆడుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు . ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వ్యవహరిస్తున్న తీరు పట్ల గత కొన్నేళ్లుగా ప్రశ్నిస్తూ వచ్చారు రియాజ్. పోలీసులం అని చెప్పి రియాజ్ ను దాచి ఉంచిన దుండగులు ఎవరు అని నిలదీశారు.
Riyaz Arrest Revanth Reacted
నిజమైన పోలీసులా లేక బీఆర్ఎస్ గూండాలా అన్నది తేలాల్సి ఉందన్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంత వరకు పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకు వెళ్లలేదంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
రియాజ్ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడ దాచి ఉంచారో చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా రియాజ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ , దాని వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతూ వస్తున్నారు. ఎక్కడా ఆయన రాజీ పడకుండా నిలదీశారు. ప్రత్యేకించి పాలనా పరంగా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. వెంటనే రియాజ్ ను విడుదల చేయాలని లేదా కోర్టులో హాజరు పర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read : CM KCR : సారూ దండం ఎట్టకేలకు మోక్షం