Jailer Movie : తలైవా , సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్(Jailer) ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న విడుదలైంది. భారీ ఆదరణ చూరగొంటోంది. మరోసారి తన మేనరిజం, డైలాగులు, డ్యాన్సులతో హోరెత్తించాడు రజనీకాంత్. ఆయనను చూసి తాను విస్తు పోయానంటూ పేర్కొంది ముద్దుగుమ్మ తమన్నా భాటియా. ఇప్పటికూ తలైవా, తమన్నా కలిసి ఆడి పాడిన కావాలా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. నెంబర్ 1 గా నిలిచింది. ఇది కూడా ఓ రికార్డ్.
Jailer Movie First Day Highlights
తాజాగా జైలర్ విడుదలై తమిళనాడ ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అయ్యింది. టీఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెన్సింగ్ సాధించింది. తొలి రోజే రాష్ట్రంలో రూ. 28.46 కోట్లు వసూలు చేసింది. ఇది రికార్డు బ్రేక్. 2023లో విడుదలైన తమిళ సినిమాలకంటే ఎక్కువగా కాసులు కొల్లగొట్టిన చిత్రంగా జైలర్ నిలిచింది.
ఇక తమిళనాడులో తొలి రోజు విడుదలైన సినిమాల కలెక్షన్స్ పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. తునివు చిత్రానికి రూ. 24.59 కోట్లు వచ్చాయి. ఇక మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ 2 మూవీకి రూ. 21.37 కోట్లు సాధించింది. తలపతి విజయ్ నటించిన వారిసు రూ. 19.43 కోట్లు , మావీరన్ రూ. 7.61 కోట్లు , మామన్నన్ రూ. 7.12 కోట్లు, వాతి రూ. 5.80 కోట్లు, పతుతల రూ. 5.63 కోట్లు వసూలు చేశాయి.
Also Read : DK Shiva Kumar : గృహలక్ష్మి కోసం కోటిన్నర మంది