CM KCR : కల సాకారం చారిత్రిక విజయం – కేసీఆర్
పాలమూరు ప్రాజెక్టుపై సీఎం
CM KCR : దార్శనికత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సాధించారు. ఆయన భగీరథ ప్రయత్నం చేశారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు అనుమతి కోసం. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా అనుమతుల సాధన లోనూ మేటి రాష్ట్రంగా తెలంగాణ సర్కార్ నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేయడంలో సక్సెస్ అయ్యారు సీఎం. ఎన్నో అడ్డంకులు, కేసులను తట్టుకుని నిలబడింది.
CM KCR Comments about Palamuru Project
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్(KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మంచి రోజు వచ్చిందని చెప్పక తప్పదన్నారు. ప్రధాన అవరోధంగా ఉన్న ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేసీఆర్. పథకం తొలి దశ పనులు తుది దశకు చేరుకున్నాయని ఈ తరుణంలో అనుమతి రావడం ఆనందంగా ఉందన్నారు .
అనుమతి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే రెండో దశ పనులు కూడా త్వరితగతిన ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు కేసీఆర్.
Also Read : Pawan Kalyan : ఇంకెంత కాలం ఈ దోపిడీ రాజ్యం