Minister KTR : ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్ – కేటీఆర్
అత్యంత విజయవంతమైన రాష్ట్రం
Minister KTR : ఐటీ, లాజిస్టిక్, ఆటోమొబైల్స్, తదితర కీలక రంగాలలో తెలంగాణ దూసుకు పోతోందన్నారు ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR). దేశంలోనే అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ఇవాళ యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్న కేంద్రం సైతం తమ అభివృద్దిని చూసి మెచ్చుకోక తప్పడం లేదన్నారు కేటీఆర్.
Minister KTR Words on Development
రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ది, గొప్ప విజన్ ఉంటే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మంత్రి. పాలనా పరంగా కీలకమైన మార్పులు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల ఏర్పాటు, ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు కేటీఆర్.
అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు , ఇంధన నిల్వ వ్యవస్థల కోసం అత్యాధునిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో తెలంగాణ నిబద్దతను నొక్కి చెప్పిందన్నారు. 2030 నాటికి 30 గిగా వాట్ , లిథియం ఇయాన్ గిగా కర్మాగారాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.08 కోట్లు