Group-2 Exam Postpone : నిరుద్యోగ అభ్యర్థులకు ఖుష్ కబర్
గ్రూప్ -2 వాయిదాకు సర్కార్ ఓకే
Group-2 Exam Postpone : ఎట్టకేలకు నిరుద్యోగుల పోరాటం ఫలించింది. గత కొన్ని రోజులుగా వరుసగా ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించారు గ్రూప్ -2 పరీక్ష రాసే అభ్యర్థులు. తమకు కొంత సమయం కావాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వల్ల ఒక్క ఉద్యోగం రావడం లేదని వాపోయారు. ఇది కేవలం ఎన్నికల కోసం ఆడుతున్న నాటకం అంటూ ధ్వజమెత్తారు. ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ -2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు తాము ఊరుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు అభ్యర్థులు.
Group-2 Exam Postpone TSPSC
త్వరలో ఎన్నికల నగారా మోగించనుంది బీఆర్ఎస్. దీంతో యువత, నిరుద్యోగుల ఓట్లకు గాలం వేయాలంటే వారు కోరిన కోర్కెల్ తీర్చాలని డిసైడ్ అయ్యింది. చివరకు సర్కార్ దిగొచ్చింది. గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎగ్జామ్ ను వచ్చే నవంబర్ నెలలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇదే సమయంలో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన దీక్షకు దిగారు. పరీక్ష రాజకీయంగా మారడంతో ఎందుకు తలనొప్పులు తెచ్చుకోవాలని ఆలోచించిన కేసీఆర్(KCR) వెంటనే వాయిదా వేయాలని ఆదేశించారు.
Also Read : Anurag Thakur : దేశాభివృద్దిలో యువత కీలకం – ఠాకూర్