Tirumala Rush : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.82 కోట్లు

Tirumala Rush : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. స్వామికి ప్రీతిపాత్ర‌మైన రోజు శ‌నివారం కావ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా అంటూ భ‌క్త బాంధ‌వులు స్తుతించారు. స్వామి వారిని స్మ‌రించుకున్నారు. ఎక్క‌డ చూసినా భ‌క్తులే తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం ఇచ్చారు. మొత్తంగా భ‌క్తుల‌తో ఆ ప్రాంతం నిండి పోయింది.

Tirumala Rush Huge

శ‌నివారం ఒక్క రోజే ఏకంగా 8 2 వేల 265 మంది శ్రీ‌నివాసుడిని ద‌ర్శించుకున్నారు. ఇక స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య 41 వేల 300 కు చేరుకుంది. భ‌క్తులు నిత్యం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌కు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి పోయాయి. భ‌క్తుల క్యూ లైన్ సిలా తోర‌ణం వ‌ద్ద అవుట్ సైడ్ వ‌ర‌కు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టికెట్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు సంబంధించి శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేందుకు క‌నీసం 24 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వులుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన‌ట్లు టీటీడీ తెలిపింది.

Also Read : Ayutha Chandi Atirudram : రేప‌టి నుండి అయుత చండీ యాగం

Leave A Reply

Your Email Id will not be published!