Pawan Kalyan : వైజాగ్ ఎంపీకి సిగ్గుండాలి – పవన్
జనసేన పార్టీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : విశాఖ ఎంపీపై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. తన కుటుంబీకులను రక్షించు కోలేని వ్యక్తి ఎలా జనాలను రక్షిస్తాడంటూ ప్రశ్నించారు. మూడో విడత వారాహి విజయ యాత్ర ఏపీలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Slams MP
రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారని , జనం నెత్తిన శఠగోపం పెట్టే పనిలో సక్సెస్ అయ్యారని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో దోపిడీ తప్ప ఇంకేమీ లేదన్నారు పవన్ కళ్యాణ్.
రాబోయే రోజుల్లో మార్పు తథ్యమన్నారు. ఎంతగా ధీమా వ్యక్తం చేసినా తాము పవర్ లోకి రాకుండా జగన్ రెడ్డి, ఆయన అనుయాయులు ఏమీ చేయలేరంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. లేక పోతే శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకడం బంద్ చేయాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. జనం ప్రతి ఒక్కరినీ ఎవరు ఏం చేస్తున్నారని నిశితంగా గమనిస్తారని స్పష్టం చేశారు.
Also Read : Ronaldo Win Title : రొనాల్డో తొలి టైటిల్ కైవసం