Chandrababu Naidu Writes : రాష్ట్రపతి..ప్రధానికి బాబు లేఖ
ఏపీలో చోటు చేసుకున్న హింసపై
Chandrababu Naidu Writes : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి రాశారు. ఇందులో ఏపీలో సీఎంగా జగన్ రెడ్డి కొలువు తీరాక హింస పెచ్చరిల్లి పోయిందని , నిరంకుశ పాలన సాగిస్తున్నాడని, అంతులేని అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థ , వ్యవస్థల విధ్వంసం , న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు లేఖలో చంద్రబాబు నాయుడు.
Chandrababu Naidu Writes Letter to PM and President
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు తన 9 పేజీల లేఖలో. మతి స్థిమితం లేకుండా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో తనపైనే హత్యాయత్నానికి పాల్పడ్డారని , చివరకు వారే కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.
పక్కా ప్లాన్ ప్రకారం సర్కార్ సపోర్ట్ తో తనపై జరుగుతున్న దాడుల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతిని, ప్రధానిని కోరారు టీడీపీ చీఫ్. రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితుల కారణంగా తనకున్న విశేష అధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు.
ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయ మూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా ద్వారా దాడులు, ఎస్ఇసి, ఎపిపిఎస్సి చైర్మన్ లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులు వంటి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.
Also Read : Pawan Kalyan : జాగా కనిపిస్తే జగన్ వాలిపోతాడు