TTD EO : నడక దారిలో మూడు చిరుతల గుర్తింపు – ఈవో
ఏవీ ధర్మారెడ్డి కీలక ప్రకటన
TTD EO : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి(TTD EO) సంచలన ప్రకటన చేశారు. సోమవారం తిరుమల కాలినడక మార్గాన్ని పరిశీలించారు స్వయంగా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చిన్నారి లక్షిత ఘటన దృష్ట్యా భద్రతను మరింత పెంచడం జరిగిందన్నారు. ఇదే సమయంలో అలిపిరి నడక మార్గంలో, శ్రీవారి మెట్లు ప్రాంతపు దారిలో 100 మందికి పైగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు.
TTD EO Comments on Security
కాగా ప్రస్తుతానికి చిన్నారిపై దాడి చేసిన చిరుతను పట్టుకున్నారని, అయితే ఇంకా మూడు చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అటవీ శాఖ అధికారుల ద్వారా తెలిసిందన్నారు ఏవీ ధర్మారెడ్డి. ఇందుకు సంబంధించి భక్తులు అలర్ట్ గా ఉండాలన్నారు.
నడకదారి సమీపంలో మరో మూడు సంచరిస్తున్నాయని గుర్తించినట్లు తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు టీటీడీ ఈవో. తిరుమలలో జరిగే టీటీటీ హై లెవల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు ఇందుకు సంబంధించి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో మూడు చిరుతలు ఉన్నాయని.
Also Read : Pawan Kalyan : రౌడీలు ఎంపీలైతే ఏం మాట్లాడతారు