KTR Release : ఎన్నికల వేడి మొదలైంది తెలంగాణలో. ప్రస్తుతం అన్ని పార్టీలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాయి. సోషల్ మీడియాను ప్రధానంగా వాడుకుంటున్నాయి. దానిపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కేంద్ర సర్కార్ పై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు, చేస్తున్న ఆగడాలు, ఇచ్చిన హామీలు, మంజూరు చేసిన నిధుల గురించి పక్కా ఆధారాలతో వివరిస్తూ వచ్చింది సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి పార్టీ సామాజిక మాధ్యమ విభాగం.
KTR Release 100 Lies of BJP CD
తాజాగా బీజేపీకి సంబంధించి ఓ పేరు కూడా పెట్టింది. అదేమిటంటే బీజేపీ 100 అబద్దాలు పేరుతో ఓ బుక్ లెట్ ను , తయారు చేసిన సీడీని తయారు చేసింది. దీనిని ఆవిష్కరించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR Release). తెలంగాణకు, దేశానికి చేసిన వాగ్ధానాలను నెర వేర్చడంలో బీజేపీ ఎలా విఫలమైందో , ఎలా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందో అన్న విషయాన్ని బట్ట బయలు చేసిందన్నారు. ప్రస్తుతం ఇది శాంపుల్ మాత్రమేనని ఇంకా మున్ముందు ఎన్ని రకాలుగా అబద్దాలు ఆడుతున్నదో తర్వాత కూడా విడుదల చేయడం జరుగుతుందన్నారు సోషల్ మీడియా బీఆర్ఎస్ ఇన్ చార్జ్.
మొత్తం మీద పార్టీల మధ్య పోరు మొదలైంది. రేపు బీజేపీ కూడా 100 బీఆర్ఎస్ హామీలు అని కూడా తీస్తుందేమో వేచి చూడాలి.
Also Read : G Kishan Reddy : ప్రతి ఇంటా జాతీయ జెండా