TTD Chairman Bhumana : భక్తుల కోసం చేతికర్రలు – చైర్మన్
భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటన
TTD Chairman Bhumana : తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా కీలక ప్రకటన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే 12 ఏళ్ల లోపు చిన్నారులతో పాటు పేరెంట్స్ ను అనుమతి ఇస్తామని తెలిపారు. పెద్ద వారిని రాత్రి 10 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నారు. ఆ తర్వాత నిలిపి వేస్తామని స్పష్టం చేశారు.
TTD Chairman Bhumana Announced New Rule
ముందస్తు జాగ్రత్తగా కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఊత (చేతి) కర్రలను ఇస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్. ఇక ఘాట్ రోడ్డులో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతి ఇస్తామన్నారు. భక్తులను ఒక్కరొక్కరిగా కాకుండా గుంపులుగా పంపిస్తామన్నారు. వీరికి తోడుగా సెక్యూరిటీ గార్డులు ఉంటారని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి(TTD Chairman Bhumana). నడక దారుల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్థాలు బయట వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక నడక దారుల్లో 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే డ్రోన్లను వినియోగిస్తామని తెలిపారు. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టులు కూడా పని చేస్తాయని తెలిపారు. ఫెన్సింగ్ కూడా అందుబాటు లోకి తీసుకు వస్తామని చెప్పారు. ఇప్పటికే 15 వేల దివ్య దర్శనం టోకెన్లు జారీ చేశామని చెప్పారు.
Also Read : Mera Bharat Mahan Comment : స్వేచ్ఛకు సలాం దేశానికి గులాం