Telangana Govt : పంచాయతీ కార్మికులకు ఖుష్ కబర్
రూ. 5 లక్షల బీమా సదుపాయం
Telangana Govt : 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న కార్మికులకు 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీ కార్మికులకు ఒక వేళ ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం పొందితే ఆర్థిక సాయం బీమా పరంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు.
Telangana Govt New Policy
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి ప్రీమియం చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 51 వేల మంది పంచాయతీ కార్మికులకు మేలు చేకూరనుందని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరో ఖుష్ కబర్ చెప్పారు సీఎం కేసీఆర్. గతంలో పంచాయతీ కార్మికులు చనిపోతే అంత్యక్రియల కోసం ప్రభుత్వ పరంగా రూ. 5 వేలు ఇచ్చేది. దానిని మరో రూ. 5 వేలు పెంచుతూ మొత్తం రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమాను వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు పంచాయతీ కార్మికులు.
Also Read : TTD Chairman Bhumana : భక్తుల కోసం చేతికర్రలు – చైర్మన్