Minister KTR : బీజేపీ..కాంగ్రెస్ పార్టీలు అవసరమా
ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
Minister KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు. ఆ పార్టీల వల్లనే దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. ఆయా పార్టీలకు అంత సీన్ లేదన్నారు. ఇప్పటికైనా తమ నిరాధార ఆరోపణలు మానుకోవాలని సూచించారు. సొల్లు కబుర్లు, ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాయంటూ ధ్వజమెత్తారు కేటీఆర్.
Minister KTR Slams BJP, Congress
జనం చెవుల్లో పూలు పెట్టాలని అనుకోవడం భ్రమ తప్ప మరొకటి కాదన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దానిని కూడా గుర్తించలేని స్థితిలో ఆయా పార్టీలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ముచ్చటగా మూడోసారి తాము పవర్ లోకి వస్తామని, సీఎంగా కేసీఆర్ కొలువు తీరి రికార్డు సృష్టిస్తారని జోష్యం చెప్పారు కేటీఆర్.
ఐటీ, లాజిస్టిక్, ఫార్మా పరంగా దేశంలోనే తెలంగాణ నెంబర్ 1లో ఉందన్నారు. ఒకప్పుడు ధాన్యాగారంగా పంజాబ్ ఉండేదని కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ను మన రాష్ట్రం భర్తీ చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు కేటీఆర్(KTR). రాష్ట్రంలో కురిసిన వానలకు చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా జల కళను సంతరించు కున్నాయని స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : Telangana Govt : పంచాయతీ కార్మికులకు ఖుష్ కబర్