Krishnajyoti Swaroopananda Swamiji : లోక కళ్యాణం కోసం యాగం
శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ
Krishnajyoti Swaroopananda Swamiji : ప్రపంచమంతా శ్రీకృష్ణుడి మయం. భగవద్గీత బోధించిన సారం ఎంతో గొప్పదన్నారు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ(Krishnajyoti Swaroopananda Swamiji). స్వామి వారి ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. భక్తులు భారీగా తరలి వచ్చారు. యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారు భక్తులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. లోక కళ్యాణం కోసం , యావత్ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ యాగాన్ని చేపట్టామన్నారు. ఈ అతిరుద్ర యాగం ఆగస్టు 27 వరకు జరుగుతుంది.
Krishnajyoti Swaroopananda Swamiji Event for Welfare of the World
ప్రతి రోజూ సామూహిక విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు గోపూజ, 7.30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్ర నామం, లలిత సహస్ర నామం, సౌందర్య లహరి పారాయణం, 2 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు , రాత్రి 7 గంటలకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, 8.30 గంటలకు తీర్థ ప్రసాదం ఉంటుంది.
మంగళవారం ఉదయం 7 గంటలకు మహా గణపతి, లక్ష్మీ గణపతి , చండీ హోమాలు, ఆది లక్ష్మీ హోమం స్వామి వారి ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం సామూహిక లక్ష గరికార్చన చేపట్టనున్నారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
16న బుధవారం ఉదయం 7 గంటలకు ధన్వంతరి, నక్షత్ర, ధనలక్ష్మీ హోమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు ధనలక్ష్మీ పూజలు చేపడతారు.17న గురువారం ఉదయం 7 గంటలకు శ్రీలక్ష్మీ కుబేరం అష్టలక్ష్మీ ధాన్య లక్ష్మీ హోమాలు, సాయంత్రం 6 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
Also Read : AP CM YS Jagan : మేరా భారత్ మహాన్ – జగన్