CM KCR : ఆశించిన లక్ష్యాలకు ఆమడ దూరం – కేసీఆర్
స్వాతంత్ర సమర యోధులకు నివాళి
CM KCR : ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 76 ఏళ్లవుతున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు సీఎం కేసీఆర్. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి సంబంధించి ఒక రకంగా ప్రగతి పరంగా కొంత మేలు జరిగినా ఆశించిన లక్ష్యాలు, ఏర్పాటు చేసుకునన గమ్యాలు ఇంకా చేరుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.
CM KCR Words on Independence Day
ఈ సందర్భంగా వేలాది మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. బలిదానాలు, త్యాగాలు చేశారు. స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు సీఎం(CM KCR). గోల్కొండ కోటపై మరోసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఒకనాడు తెలంగాణ రాదన్నారు. కానీ ఛాలెంజ్ చేసి తీసుకు వచ్చానని చెప్పారు కేసీఆర్.
ప్రతి ఒక్కరి హృదయంలో దేశం పట్ల అభిమానం పెంపొందించే విధంగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రసాదించిన వనరులు అపారంగా ఉన్నాయని అన్నారు. అంతకంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే కష్టపడి పనిచేసే ప్రజలు కోట్లాది మంది ఉన్నారని తెలిపారు. అయినా పాలకుల అసమర్థత, భావ దారిద్రం కారణంగా దేశానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.
Also Read : Krishnajyoti Swaroopananda Swamiji : లోక కళ్యాణం కోసం యాగం