CJI DY Chandrachud : రాజ్యాంగం దేశానికి రక్షణ కవచం
జస్టిస్ డీవై చంద్రచూడ్ కామెంట్
CJI DY Chandrachud : భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని బార్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు సీజేఐ. ఈ సందర్భంగా ప్రసంగించారు. డాక్టర్ బాబా సాహెబ్ రాసిన భారత రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంగా పని చేస్తుందని చెప్పారు.
CJI DY Chandrachud Words on Supreme Court
రాజ్యాంగ విలువల పునరుద్దరణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. దేశంలో సుప్రీంకోర్టు కీలకమైన కేసులను టేకప్ చేసిందన్నారు జస్టిస్ చంద్రచూడ్(CJI DY Chandrachud). చట్ట బద్దమైన పాలనకు రక్షణగా నిలుస్తుందని చెప్పారు. దీనిని గుర్తించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిమితుల్లో పాలనా సంస్థలు పని చేసేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి న్యాయ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు జస్టిస్ ధనంజయ చంద్రచూడ్.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశంలో ఉన్న 137 కోట్ల మంది భారతీయులకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని అన్నారు. మన జీవితాల్లో రాజ్యాంగ పరమైన ఆలోచనలు, విలువలు వర్దిల్లేలా త్రివర్ణ పతాకం పిలుస్తోందన్నారు జస్టిస్ ధనంజయ చంద్రచూడ్. ఇది మన సామూహిక వారసత్వాన్నికి చిహ్నంగా పని చేస్తోందని చెప్పారు. మన భవిష్యత్తు ఆకాంక్షల వైపు మార్గ నిర్దేశం చేస్తుందన్నారు.
Also Read : PM Modi : మణిపూర్ కోసం భారత దేశం – మోదీ