Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి ఆదాయం రూ. 4.14 కోట్లు
Tirumala Rush : తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత నాలుగు నెలల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్నది. ఎక్కడా తగ్గడం లేదు. బుధవారం శ్రీనివాసుడిని 75 వేల 776 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 700 మంది శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
Tirumala Rush with Huge People
తిరుమల లోని 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వేచి ఉన్న సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారి భక్తులకు సంబంధించి దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) వెల్లడించింది. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుండి ఎన్నో అష్ట కష్టాలు పడి తిరుమల పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించడంపై టీటీడీ ఫోకస్ పెట్టిందని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదే సమయంలో సామాన్యులకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా భక్తులకు చేతి కర్రలను ఇస్తున్నట్లు చెప్పారు.
Also Read : Pawan Kalyan : మట్టి దిబ్బలను వదలని జగన్