BJP MLA’s Joining : కాంగ్రెస్ వైపు బీజేపీ ఎమ్మెల్యేల చూపు

క‌ర్ణాట‌క‌లో మారుతున్న రాజ‌కీయం

BJP MLA’s Joining : ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు ప‌డుతోంది ప్ర‌భుత్వాన్ని న‌డిపేందుకు . ఎన్నిక‌ల సంద‌ర్భంగా 5 హామీల‌ను ప్ర‌క‌టించింది. వాటిని నెర‌వేర్చాలంటే భారీ ఎత్తున ఖ‌జానా నిండాల్సి ఉంది. ఐటీ ప‌రంగా ఇండియాలో టాప్ లో కొన‌సాగుతోంది బెంగ‌ళూరు. ప్ర‌స్తుతం దానితో హైద‌రాబాద్ పోటీ ప‌డుతోంది. సిలికాన్ వ్యాలీగా పేరు పొందింది బెంగ‌ళూరు సిటీ.

BJP MLA’s Joining Congress Viral

ఈ త‌రుణంలో గ‌త కొంత కాలంగా ప‌ట్టు క‌లిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చీఫ్‌, ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సారథ్యంలో పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. భారీ మెజారిటీని సాధించింది. మొత్తం 224 సీట్ల‌కు గాను కాంగ్రెస్ కు 135 సీట్లు వ‌చ్చాయి. బీజేపీ 64 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక చ‌క్రం తిప్పుదామ‌ని భావించిన జేడీఎస్ చీఫ్ , మాజీ సీఎం కుమార స్వామి పార్టీకి కేవ‌లం 19 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఈ త‌రుణంలో రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన డీకే శివ‌కుమార్. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు బీజేపీకి చెందిన న‌లుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు 2024 కంటే లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్(BJP Mlas Join) కానున్న‌ట్టు టాక్.

వీరిలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేర్ల‌లో య‌శ్వంత్ పూర్ కు చెందిన ఎస్టి సోమ‌శేఖ‌ర్ , ఎల్లాపూర్ కు చెందిన శివ‌రామ్ హెబ్బార్, కెఆర్ పురంకు చెందిన భైర‌తి బ‌స‌వ‌రాజ్ , మ‌హాల‌క్ష్మి లే అవుట్ కు చెందిన కె. గోపాల‌య్య చేర‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Rahul Gandhi : నెహ్రూ మెమోరియ‌ల్ పేరు మార్పు

Leave A Reply

Your Email Id will not be published!