MK Stalin : తిరుమావళవన్ అరుదైన నేత – స్టాలిన్

సామాజిక చింత‌న క‌లిగిన ర‌చ‌యిత‌

MK Stalin : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తిరుమావ‌ళ‌వ‌న్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆయ‌న ఎంపీగా మాత్ర‌మే చాలా మందికి తెలుసు అని కానీ గొప్ప సామాజిక నేప‌థ్యం ఉన్న త‌త్వ‌వేత్త అని పేర్కొన్నారు. విడుత‌లై చిరుతైగ‌ల్ క‌ట్చి కి చీఫ్ గా ఉన్నారు తిరుమావ‌ళ‌వ‌న్. ఆగ‌స్టు 17న 1962లో పుట్టారు. ఆయ‌న‌కు 60 ఏళ్లు. పుట్టిన‌రోజు సంద‌ర్బంగా స్టాలిన్(MK Stalin) శుభాకాంక్ష‌లు తెలిపారు. వీసీకే పార్టీని 1982లో స్థాపించారు. ఆయ‌న పూర్తి పేరు తోల్క‌ప్పియ‌న్ తిరుమావ‌ళ‌వ‌న్. ఆయ‌న‌ను అంతా థోల్ అని పిలుస్తారు. సామాజిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంలో , నిల‌దీయ‌డంలో త‌న‌కు తానే సాటిగా గుర్తింపు పొందారు. 1990లో ద‌ళిత నాయ‌కుడిగా నిలిచాడు.

MK Stalin Wishes to Tirumavalayan

1999లో అధికారికంగా పాలిటిక్స్ లోకి ఎంట‌ర్ అయ్యాడు. కుల ఆధారిత వివ‌క్షను నిర‌సించాడు. యుద్దం ప్ర‌క‌టించాడు. శ్రీ‌లంక‌లో త‌మిళ జాతీయ వాద ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తు తెలిపాడు తిరుమావ‌ళ‌వ‌న్. 1999, 2004లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడి పోయాడు. 2001లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పొత్తుతో గెలుపొందాడు.

2004లో ఆ ప‌ద‌వికి రాజీనామా చేశాడు. ఆయ‌న ర‌చ‌యిత కూడా, త‌మిళ సినిమాలో కూడా న‌టించాడు. 2019లో తిరుమావ‌ళ‌వ‌న్ ఎంపీగా గెలుపొందాడు. 2021లో త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో నాలుగు సీట్లు గెలుపొందేలా త‌న పార్టీని న‌డిపించాడు. ఈలం ఉద్య‌మంపై ఆస‌క్తి క‌లిగి ఉన్నాడు.

Also Read : DK Shiva Kumar : కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రణ‌పై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!