Chandrababu Naidu : పన్నుల మోతలో ఏపీ సర్కార్ టాప్
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : పన్నుల మోతలో ఏపీ సర్కార్ నెంబర్ 1గా మారిందని అన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). గురువారం మండపేటలో పర్యటించారు. భవిష్యత్ కు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. మండపేట అనాది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉందన్నారు.
Chandrababu Naidu Comments on YS Jagan
తాపేశ్వరం కాజా అంత తియ్యని మనసును కలిగిన వాళ్లు ఇక్కడి ప్రజలంటూ కితాబు ఇచ్చారు. వరుసగా మూడుసార్లు మండపేటలో టీడీపీ జెండా ఎగిరిందన్నారు. ఈసారి కూడా ఎగరడం ఖాయమన్నారు నారా చంద్రబాబు నాయుడు.
భవిష్యత్ తరాలకు ఏం కావాలో ఆలోచించి విజన్ ఇచ్చే వ్యక్తిని తాను అన్నారు. నా విజన్ గురించి అనుచిత కామెంట్స్ చేసిన వాళ్లు ఇవాళ 420గా మిగిలి పోయారంటూ ఎద్దేవా చేశారు . 2014లో విభజన కారణంగా కష్టాలు ఉన్నా పెన్షన్ పెంచానని, సాగునీటి ప్రాజెక్టులు కట్టానని, రోడ్లు వేశానని, ఉద్యోగాలు ఇచ్చానని, పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా చేశానని చెప్పారు చంద్రబాబు నాయుడు.
కానీ ప్రస్తుతం ఏపీలో అందుకు పూర్తిగా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పన్నుల మోత తప్ప అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదన్నారు టీడీపీ చీఫ్. ఇసుక మాఫియా చెలరేగుతోందన్నారు. ఇవాళ జగన్ అండ్ టీం స్టువర్టుపురం దొంగల్లాగా దోచుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు.
Also Read : MK Stalin : తిరుమావళవన్ అరుదైన నేత – స్టాలిన్