TTD Chairman Bhumana : ఆపరేషన్ చిరుత కొనసాగిస్తాం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman Bhumana : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆపరేషన్ చిరుతను(TTD Chairman Bhumana) కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తిరుమల నడక దారిలో గురువారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. ఈ సందర్బంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
TTD Chairman Bhumana Starts Chirutha
అటవీ శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చైర్మన్. తిరుమల అటవీ ప్రాంతంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందన్నారు. నడక మార్గంలో వచ్చే చిరుతలను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతుందన్నారు భూమన.
అటవీశాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడిచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు చైర్మన్. 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మరో 200 కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కర్రలు ఇచ్చి బాధ్యతల నుంచి టీటీడీ తప్పుకుంటోందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : Chandrababu Naidu : పన్నుల మోతలో ఏపీ సర్కార్ టాప్