Gangavaram Port Protest : గంగవరం గరం గరం
కార్మికుల ఆగ్రహంతో ఉద్రిక్తత
Gangavaram Port Protest : గంగవరం ఓడ రేవు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం కార్మికులు పెద్ద ఎత్తున పోర్టును ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు(Gangavaram Port Protest) రోడ్లపైకి వచ్చారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని , కనీస వేతనం రూ. 36 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
Gangavaram Port Protest Viral
కాంట్రాక్టు కార్మికులకు భరోసా ఇవ్వాలని కోరుతూ అదానీ గంగవరం పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో గంగ వరం పోర్టు పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. ఓడ రేవులోకి ప్రవేశించకుండా ఆపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కార్మికులకు, ఖాకీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మధ్యన తోపులాట జరిగింది.
పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లను తీర్చక పోతే మరోసారి ఉద్యమిస్తామని, ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అదానీ గ్రూప్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. దీనికి కారణం సీఎం జగన్ , పీఎం మోదీనంటూ ఆరోపించారు. వారి వల్లనే ఇవాళ అదానీ ఇక్కడి దాకా వచ్చాడని అన్నారు.
Also Read : Nara Chandrababu Naidu : టార్చ్ లైట్ టెక్నాలజీ నా పుణ్యమే