CM KCR Condolence : కృష్ణారావు మృతి తీరని లోటు – కేసీఆర్
జర్నలిస్టుగా చేసిన సేవలు గ్రేట్
CM KCR Condolence : ప్రముఖ జర్నలిస్టు, సంపాదకులు సీ. హెచ్. వీ. ఎం. కృష్ణారావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్(KCR). అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ పాత్రికేయుడిగా చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పలు రంగాలలో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సీఎం గుర్తు చేసుకున్నారు.
CM KCR Condolence to C.H.V.M Krishnarao
నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా , మీడియా రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ తెలిపారు.
ఇదిలా ఉండగా కృష్ణారావు క్యాన్సర్ వ్యాధితో గత కొంత కాలం నుంచి బాధ పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఆయనను తెలిసిన వారంతా , జర్నలిస్టులు ఎక్కువగా బాబాయి అని పిలిచే వారు. కృష్ణారావు చివరి దాకా నమ్మిన పాత్రికేయ విలువల కోసం పాటుపడ్డారు. ఎక్కడా రాజీ పడకుండా తన జీవితాన్ని చాలించారు. ఆయన మృతి ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాత్రికేయ రంగానికి తీరని లోటు.
Also Read : Gangavaram Port Protest : గంగవరం గరం గరం