Arvind Kejriwal : మణిపూర్ తో సంబంధం లేదంటే ఎలా
ప్రధానిపై నిప్పులు చెరిగిన ఢిల్లీ సీఎం
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. గురువారం అసెంబ్లీ సాక్షిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు దేశంలో అంతర్భాగమైన మణిపూర్ కాలి పోతుంటే ప్రధాని మోదీ, బీజేపీ శ్రేణులు ఎలా మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు మణిపూర్ లో ఇంకా హింస, అల్లర్లు తగ్గడం లేదు. వేలాది మంది పోలీసులను, ఆర్మీని మోహరించినా కంట్రోల్ కావడం లేదు. దీనికి బాధ్యత వహించాల్సిన మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Arvind Kejriwal Slams BJP Govt
అంతే కాదు మణిపూర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు బయట చెబుతున్నారు . అంటే అర్థం ప్రధాన మంత్రి అలా చెప్పమన్నారా అని ప్రశ్నించారు ఢిల్లీ సీఎం(Arvind Kejriwal). ఇది కేవలం వారి ఆలోచన మాత్రమే కాదు ఇలాగే మోదీ కూడా అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
బీజేపీ, దాని అనుబంధ సంస్థలు మోదీని ఈ విషయంలో క్షమించవచ్చని కానీ చరిత్ర ఉపేక్షించదని హెచ్చరించారు అరవింద్ కేజ్రీవాల్. 150 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. 10 వేల మందికి పైగా సైనికులు మోహరించినా ఫలితం లేక పోయిందన్నారు. ఆడపిల్లలను ఊరేగిస్తే ఇప్పటి వరకు ఖండించ లేదన్నారు.
Also Read : Minister KTR : మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్లాన్