Hyderabad Steel Bridge : స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు – కేసీఆర్
ప్రకటించిన తెలంగాణ సీఎం
Hyderabad Steel Bridge : తన సహచరుడు, కేబినెట్ లో మంత్రిగా పని చేసిన దివంగత నాయిని నరసింహా రెడ్డికి నివాళిగా రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన వంతెనకు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. నగరంలోని ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు.
Hyderabad Steel Bridge Name
ఇది నగరానికి తలమానికంగా నిలిచింది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిగా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు నాయిని నరసింహా రెడ్డి. అంతే కాదు వీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు గాను ఈ నిర్ణయం సీఎం తీసుకున్నారని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.
సుమారు రూ. 450 కోట్ల రూపాయలతో ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. దీనిని ఆగస్టు 19న శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించనున్నారు. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) లో భాగంగా చేపట్టింది.
Also Read : Jaleel Khan Chandrababu : రాష్ట్రం కోసం ప్రధాని పదవి రిజెక్ట్