Arvind Kejriwal : చదుకున్నోళ్లకు ఓటు వేయమంటే తప్పా
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. చదువుకున్న నాయకులకు ఓటు వేయమని అడగడం నేరం అవుతుందా అని ప్రశ్నించారు . ఇదేమైనా తప్పా అని నిలదీశారు. చదువుకున్న నేతలకు ఓటు వేయండి అని విద్యార్థులను కోరిన ట్యూటర్ ను అన్ అకాడెమీ తొలగించింది. వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది వేదిక కాదని ఎడ్ టెక్ సంస్థ స్పష్టం చేసింది.
Arvind Kejriwal Slams Unacademy
దీనిపై శుక్రవారం తీవ్రంగా స్పందించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). దేశ ప్రజలు ఒకసారి ఆలోచించు కోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ఎక్కడా చదువుకున్న వాళ్లకు ఓటు వేయొద్దని , వేయాలని కోరమని చెప్పలేదన్నారు. ఈ దేశం ఇంకా ముందుకు వెళ్లక పోవడానికి కారణం ఇలాంటి వాళ్ల వల్లనేనని మండిపడ్డారు సీఎం.
10వ తరగతి చదువుకునే విద్యార్థులకు కూడా ఓటు హక్కు, రాజ్యాంగం ప్రవేశిక, కూర్పు, నిర్మాణం, భారత దేశ పరిపాలన వ్యవస్థ గురించి పాఠాలు ఉంటాయని తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. కానీ ఇందుకు విరుద్దంగా ఎడ్ టెక్ సంస్థ వ్యవహరించడం దారుణమన్నారు . ప్రస్తుతం ఎడ్ టెక్ తీసుకున్న నిర్ఱయం వివాదాస్పదంగా మారుతోంది. దీనిపై ప్రజలు మీరే ఆలోచించు కోవాలని సూచించారు ఢిల్లీ సీఎం.
Also Read : Bhagwant Mann : బాధిత కుటుంబాన్ని రక్షించిన సీఎం