K Sivan : చంద్రయాన్-3కి గ్రౌండ్ సాయం అక్కర్లేదు
ఇస్రో మాజీ చీఫ్ కైలాస వాడివో శివన్
K Sivan : శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ -3 సురక్షితంగా చేరుకుంది అంతరిక్షం లోకి. అయితే ల్యాండర్ ఆటోమేటిక్ మోడ్ లో ఉంటుందన్నారు ఇస్రో మాజీ చీఫ్ కైలాస వాడివో శివన్(K Sivan). డేటా ఆధారంగా దాని విధులను ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మైదానం నుంచి ఎలాంటి అంతరాయం కలగడం లేదన్నారు.
K Sivan Said About Chandrayan-3
ఆయన జాతీయ ఛానల్ తో మాట్లాడారు . సెన్సార్ లు, ఇతర సిస్టమ్ లలో ఎల్లప్పుడూ కొంత రిడెండెన్సీ ఉంటుందన్నారు. ఇది సిస్టమ్ లో నిర్మించిన ఇంటెలిజెన్స్ ప్రకారం ల్యాండర్ పని చేసేందుకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు శివన్.
ల్యాండర్ విక్రమ్ ఇవాళ సాయంత్రం 4 గగంటలకు డీబూస్టింగ్ విన్యాసాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిందన్నారు. నిన్న ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విడి పోయిందని, చంద్రుని వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.
అయితే ల్యాండర్ కక్ష్య నుండి దాని ప్రయాణాన్ని క్రమబద్దీకరిస్తున్నప్పుడు సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు దానిని సున్నాకి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు శివన్. ఇది అత్యంత క్లిష్టమైన, కీలకమైన చర్య అని పేర్కొన్నారు.
Also Read : Minister KTR : బోటు నడిపిన కేటీఆర్